పెళ్లివేడుకలో దొరికిపోయిన 'దొంగ' దంపతులు... చితకబాది పోలీసులకు అప్పగించిన జనాలు!

Couple enters into wedding hall and stole gold from a woman
  • కామారెడ్డిలో ఘటన
  • బంధువులమంటూ పెళ్లికి వచ్చిన దంపతులు
  • వధువు తరపు మహిళ నుంచి బంగారం చోరీ
కొన్ని సందర్భాల్లో వివాహాలు, ఇతర ఫంక్షన్లలో తెలియని వాళ్లు కూడా వచ్చి తినేసి వెళ్లిపోతుంటారు. కొన్నిసార్లు చోరీలు కూడా జరుగుతుంటాయి. కామారెడ్డిలోని అయ్యప్ప ఫంక్షన్ కూడా ఇలాంటి ఓ ఘటనకు వేదికగా నిలిచింది. అక్కడ పెళ్లి జరుగుతుండగా ఓ జంట ప్రత్యక్షమైంది. కామారెడ్డి ఇందిరానగర్ కు చెందిన పరమేశ్, యశోద బంధువులమంటూ పెళ్లికి వచ్చారు.

వచ్చిన దంపతులు ఊరికే ఉండలేదు. పెళ్లికుమార్తె బంధువర్గంలోని ఓ మహిళ నుంచి బంగారు ఆభరణాలు దొంగిలించారు. పెళ్లికి వచ్చిన ఇతరులు వారి నిర్వాకాన్ని గమనించి పట్టుకున్నారు. వారిని సోదా చేయగా మూడు తులాల బంగారం దొరికింది. దాంతో అక్కడున్న వాళ్లు ఆ దొంగ దంపతులను చితకబాదారు. ఆపై పోలీసులకు సమాచారం అందించారు. పరమేశ్, యశోదలను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు షురూ చేశారు.
Go Back to Shorts
Couple
Thieves
Wedding Hall
Kamareddy
Police

More Telugu News