‘రాంగ్ గోపాల్ వర్మ’ విడుదల తేదీ ఖరారు

24-11-2020 Tue 20:36
  • వర్మ కథాంశంతో తెరకెక్కిన చిత్రం
  • సీనియర్ దర్శకుడు ప్రభు దర్శకత్వం
  • ప్రధాన పాత్రను పోషించిన షకలక శంకర్
Wrong Gopal Varma movie to release on Dec 4

సినీ దర్శకుడు వర్మ కథాంశంతో తెరకెక్కిన చిత్రం 'రాంగ్ గోపాల్ వర్మ'. షకలక శంకర్ ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రానికి సీనియర్ జర్నలిస్టు ప్రభు దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. శ్రేయాస్ ఏటీటీ ద్వారా డిసెంబర్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కత్తి మహేశ్, జబర్దస్త్ అభి కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషించారు.

గతంలో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న వర్మ... గత కొన్నేళ్లుగా రూటు మార్చారు. ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, నగ్న చిత్రాలు తీస్తూ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. సామాజిక కాలుష్యానికి కారకుడిగా తయారయ్యాడని చెపుతూ ఈ చిత్రాన్ని ప్రభు తెరకెక్కించారు. ఇప్పటికే ఈ చిత్రానికి చెందిన ప్రోమోలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. సినిమాను ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో వేచి చూడాలి.