చైనాపై డిజిటల్ స్ట్రయిక్స్... మరో 43 యాప్ లను బ్లాక్ చేసిన కేంద్రం

24-11-2020 Tue 18:41
  • దేశ భద్రతకు భంగం కలిగిస్తున్నాయన్న కేంద్రం
  • అలీబాబా గ్రూప్ యాప్ లపై వేటు
  • ఇప్పటికే టిక్ టాక్, పబ్జీపైనా నిషేధం
India blacks another bunch of apps

దేశ భద్రతకు, సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ఉన్నాయంటూ కేంద్రం మరో 43 యాప్ లను అడ్డుకుంది. ఈ యాప్ ల కార్యకలాపాలు దేశ రక్షణ రీత్యా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఆ యాప్ లను బ్లాక్ చేసింది. తాజాగా కేంద్రం నిషేధించిన యాప్ లలో చాలా యాప్ లు చైనాకు చెందినవే. వీటిలో నాలుగు యాప్ లను చైనా ఈకామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ కు చెందినవని గుర్తించారు.

 69-ఏ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం అనుసరించి ఈ యాప్ లను కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిషేధించినట్టు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ యాప్ లపై భారతీయ యూజర్ల నుంచి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కు, కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లెక్కకుమిక్కిలిగా ఫిర్యాదులు వచ్చాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

గాల్వన్ ఘర్షణల అనంతరం కేంద్రం సర్జికల్ దాడుల తరహాలో 'డిజిటల్ స్ట్రయిక్స్' పేరిట చైనాకు చెందిన దాదాపు 170 యాప్ లపై నిషేధాజ్ఞలు జారీ చేసింది. వీటిలో ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్, ఆన్ లైన్ గేమ్ పబ్జీ కూడా ఉన్నాయి.

తాజాగా బ్లాక్ చేసిన యాప్ లు ఇవే...