D Arvind: ఎప్పుడూ సచివాలయానికి వెళ్లని కేసీఆర్ దేశానికి దిశ, దశ చూపుతారా?: ధర్మపురి అరవింద్

TRS is comedians party says D Arvind
  • టీఆర్ఎస్ అనేది కమెడియన్ల పార్టీ
  • లాక్ డౌన్ సమయంలో కేటీఆర్ సినిమాలు చూస్తూ గడిపారు
  • తెలంగాణను గుజరాత్ చేయడమే మా లక్ష్యం
టీఆర్ఎస్ పార్టీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాలనుకోవడం జరగని పని అని చెప్పారు. ఒక్క పరిశ్రమను కూడా కేటీఆర్ హైదరాబాదుకు తీసుకురాలేకపోయారని అన్నారు. ఏనాడూ సచివాలయానికే వెళ్లని కేసీఆర్... ఈ దేశానికే మార్గనిర్దేశం చేస్తారా? అని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీ అనేది కమెడియన్ల పార్టీ అని, ఆ పార్టీలో ఉన్నవారంతా సోమరిపోతులని దుయ్యబట్టారు. కేసీఆర్ కుటుంబం ప్రతి నెల రూ. 15 లక్షల జీతం తీసుకుంటోందని అన్నారు.

కరోనా సమయంలో ఓ వైపు జనాలు చనిపోతుంటే... లాక్ డౌన్ సమయంలో కేటీఆర్ సినిమాలు చూస్తూ గడిపారని అరవింద్ విమర్శించారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నామని టీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటోందని... ఈశాన్య రాష్ట్రాల్లో కూడా 24 గంటల విద్యుత్ ఇస్తున్నారని అన్నారు. బీజేపీ జీహెచ్ఎంసీ మేనిఫెస్టోను విడుదల చేశాక... టీఆర్ఎస్ మేనిఫెస్టో వెబ్ సైట్లో కూడా కనిపించదని అన్నారు. తెలంగాణను గుజరాత్ చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.
D Arvind
BJP
KTR
KCR
TRS

More Telugu News