ఏపీ కరోనా అప్ డేట్: 1,085 పాజిటివ్ కేసులు, 8 మరణాలు

24-11-2020 Tue 18:12
  • గత 24 గంటల్లో 65,101 కరోనా పరీక్షలు
  • అత్యధికంగా కృష్ణా జిల్లాలో 224 కేసులు
  • అనంతపురం జిల్లాలో అత్యల్పంగా 10 కేసులు
AP covid cases update

ఏపీలో గడచిన 24 గంటల్లో 65,101 కరోనా టెస్టులు నిర్వహించగా 1,085 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 224 కొత్త కేసులు వెల్లడయ్యాయి. చిత్తూరు జిల్లాలో 142, పశ్చిమ గోదావరి జిల్లాలో 138, గుంటూరు జిల్లాలో 126, తూర్పు గోదావరి జిల్లాలో 116 కేసులు గుర్తించారు. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 10 మందికి కరోనా నిర్ధారణ అయింది. శ్రీకాకుళం జిల్లాలో 26, కర్నూలు జిల్లాలో 31, ప్రకాశం జిల్లాలో 42 కేసులు వచ్చాయి. అదే సమయంలో రాష్ట్రంలో 1,447 మంది కరోనా నుంచి కోలుకోగా, 8 మంది మరణించారు.

ఇప్పటివరకు ఏపీలో 8,63,843 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,43,863 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 13,024 మందికి చికిత్స జరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 6,956 మంది కరోనా కారణంగా మృతి చెందారు.