Prabhakar Reddy: మూతలు తీయడంలో నెల్లూరు కుర్రాడు ముదురు... నుదురు చాలు, ఓపెనర్ అవసరం లేదు!

Youth removes battle caps with forehead as Guinness recognized the record
  • గిన్నిస్ రికార్డు సాధించిన ప్రభాకర్ రెడ్డి
  • నిమిషంలో 68 మూతలు తీసిన వైనం
  • నుదుటితో కొడుతూ మూతలు తీసిన కుర్రాడు
  • వీడియో వైరల్
కొన్నిరకాల కూల్ డ్రింక్, బీరు బాటిళ్ల మూతలు తీయాలంటే ఓపెనర్ అవసరం. అయితే నెల్లూరుకు చెందిన ప్రభాకర్ రెడ్డి ఓపెనర్ తో పనిలేకుండా తన నుదుటితో బాటిల్ మూతను ఓపెన్ చేస్తాడు. ప్రభాకర్ రెడ్డి తన నొసటితో గట్టిగా కొట్టడం ద్వారా మూతను తీయడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇటీవలే ఈ నెల్లూరు కుర్రాడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సు పుస్తకంలోకి కూడా ఎక్కాడు.

ఈ విధంగా నుదుటితో ఒక్క నిమిషంలో 68 బాటిళ్ల మూతలు తీసి ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్సు వారు కూడా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం విశేషం. ప్రభాకర్ రెడ్డి నుదుటితో కొడుతూ మూతలు తీస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రభాకర్ రెడ్డి ప్రపంచ రికార్డు నెలకొల్పే క్రమంలో పాకిస్థాన్ కు చెందిన మహ్మద్ రషీద్ రికార్డు బద్దలు కొట్టాడు. రషీద్ 2016లో నుదుటి ద్వారా నిమిషంలో 61 మూతలు తీశాడు.
Prabhakar Reddy
Battle Caps
Fore Head
Nellore
Guinnes Book

More Telugu News