Kangana Ranaut: కంగనా రనౌత్ ను ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయొద్దు: బాంబే హైకోర్టు

Kangana Ranaut To Appear Before Mumbai Cops On January 8 orders court
  • కంగన, రంగోలిలపై ముంబై పోలీసుల కేసు
  • అరెస్ట్ చేయకుండా కోర్టును ఆశ్రయించిన కంగన
  • జనవరి 8న పోలీసుల ముందు హాజరు కమ్మన్న కోర్టు 
సోషల్ మీడియా పోస్టుల ద్వారా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలీ చందేల్ పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసును కొట్టేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ బాంబే హైకోర్టును వీరు ఆశ్రయించారు.

 సమన్లను తాము గౌరవిస్తున్నామని... ఇదే సమయంలో అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని కోరారు. వీరి తరపు వాదనలను విన్న హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. వీరిని ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. జనవరి 8న ముంబై పోలీసుల ముందు హాజరుకావాలని కంగన, రంగోలీని ఆదేశించారు. తాము లోతుగా వాదనలను వినేంత వరకు పిటిషన్ దారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది.
Kangana Ranaut
Mumbai Police
Bombay High Court
Bollywood

More Telugu News