ప్రియుడితో కలిసి హుషారుగా డ్యాన్స్ చేసిన సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలు.. వీడియో వైరల్

24-11-2020 Tue 13:08
  • వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన అంకిత
  • బ్యాంగ్ బ్యాంగ్ సినిమాలోని పాట‌కు డ్యాన్స్
  • డేటింగ్‌లో ఉన్న ముద్దుగుమ్మ
ankita dance with her lover

తన ప్రియుడితో కలిసి హుషారుగా డ్యాన్స్ చేసింది సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలు, నటి అంకితా లోఖండే. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. బాలీవుడ్‌లో 2014లో హృతిక్, క‌త్రినా కైఫ్ న‌టించిన బ్యాంగ్ బ్యాంగ్ సినిమాలోని పాట‌కు వారిద్దరు డ్యాన్స్ చేశారు.

కొన్ని రోజుల క్రితం దీపావ‌ళి పండుగ‌ను కూడా వీరిద్ద‌రూ క‌లిసి జరుపుకున్నారు. ఆ పండుగ‌కు సంబంధించిన ఫొటోల‌ను కూడా ఆమె షేర్ చేసింది. కుశాల్ టాండ‌న్ అనే వ్యక్తితో ఆమె డేటింగ్‌లో ఉన్న‌ట్టు  ప్రచారం జరుగుతోంది.  కాగా, గతంలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్, అంకితా మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగిన విషయం తెలిసిందే. సుశాంత్ ‌ ఆత్మహత్య చేసుకున్న తర్వాత అంకిత తరచుగా వార్తల్లో నిలుస్తోంది. సుశాంత్ ఆత్మహత్య గురించి ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలకు ఆమె మద్దతు ఇస్తూ వచ్చింది. సుశాంత్ ఆ‍త్మహత్య చేసుకోవడానికి గల కారణాలు వెలికి తీయాలని డిమాండ్ చేసింది.