Ram Nath Kovind: కుటుంబ సమేతంగా తిరుచానూరుకి రాష్ట్రపతి.. స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్, ఈవో

  • రాష్ట్రపతితో పాటు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ 
  • ప్రభుత్వ ప్రతినిధులుగా నారాయణ స్వామి, గౌతమ్ రెడ్డి 
  • శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి 
kovind visits ttd

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ కుటుంబ సమేతంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి స్వాగతం పలికారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా ఉన్నారు. ప్రభుత్వ ప్రతినిధులుగా మంత్రులు నారాయణ స్వామి, గౌతమ్ రెడ్డి కూడా ఉన్నారు. కాసేపట్లో కోవింద్ తిరుమలలోని విశ్రాంతి గృహానికి చేరుకుంటారు.  

కొద్ది సేపటి తర్వాత క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీ వరాహస్వామివారిని దర్శించుకుని మహద్వారం ద్వారా ఆలయ ప్రవేశం చేసి శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తిరుమల నుంచి బయలుదేరి విమానాశ్రయం చేరుకొని   చెన్నైకు తిరుగు ప్రయాణమవుతారు.
కాగా, ఈ రోజు ఉదయం రాష్ట్రపతి కోవింద్ ఢిల్లీ నుంచి చెన్నైకు కొత్త విమానంలో వెళ్లడం విశేషం. ప్రత్యేకంగా తయారు చేయించిన ఎయిర్‌ ఇండియా వన్‌ బీ777 విమానాన్ని ఈ సందర్భంగా రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రారంభించి, ఆ విమానంలో తొలిసారిగా ప్రయాణించారు. ప్రయాణ సమయంలో విమానం లోపల తక్కువ శబ్దం వినిపించేలా దీన్ని తయారు చేశారు. అధునాతన సౌకర్యాలతో ఈ విమానం ఉంటుంది. అధిక ఇంధన సామర్థ్యంతో ఈ విమానం పనిచేస్తుంది.

More Telugu News