రెండో పెళ్లిపై క్లారిటీ ఇవ్వడానికి మీడియా ముందుకు రానున్న ప్ర‌భుదేవా!

24-11-2020 Tue 11:41
  • సెప్టెంబరులో రెండో పెళ్లి జరిగినట్టు వార్తలు  
  • ఇప్పటికే స్పష్టం చేసిన రాజు సుందరం
  • భార్యను పరిచయం చేయనున్న ప్రభుదేవా
prabudeva to give clarity on second marriage

సినీ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రభుదేవా సోదరుడు రాజు సుందరం కూడా నిర్ధారించారు. 1995లో రామలత అనే మహిళను వివాహం చేసుకున్న ప్రభుదేవా, 16 ఏళ్ల తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్నాడు. అనంతరం హీరోయిన్ నయనతారను ఆయన పెళ్లాడతారని వార్తలు వచ్చాయి.

అయితే, వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో వారి పెళ్లి జరగలేదు. తాజాగా, ముంబైకి చెందిన డాక్టర్ హిమనిని ప్రభుదేవా పెళ్లి చేసుకున్నాడు. అయితే, దీనిపై ఆయన అధికారికంగా ప్రకటన మాత్రం చేయలేదు. హిమనితో అంతకుముందు ఆయన సహజీవనం చేసినట్లు తెలుస్తోంది. వీటన్నింటిపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రభుదేవా ఈ రోజు మీడియా ముందుకు రానున్నాడు.

త‌న భార్య‌ని మీడియాకు ప‌రిచ‌యం చేయాల‌ని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఏడాది పాటు డేటింగ్‌లో ఉన్న ప్రభుదేవా, హిమని సెప్టెంబరు‌లోనే వివాహబంధంతో ఒక్కటయ్యారని తెలుస్తోంది. వీటన్నింటికీ సమాధానం చెప్పి ప్రభుదేవా స్పష్టతనివ్వనున్నాడు.