Butta Bomma: అల్లు అర్జున్‌ని మెచ్చుకుంటూ క్రికెటర్ డేవిడ్ వార్న‌ర్ పోస్ట్!

 david warner wishes allu arjun for Butta Bomma record
  • ‘బుట్టబొమ్మ’ పాటకు 450 మిలియన్ల వ్యూస్
  • పాటలో అల్లు అర్జున్ అదిరిపోయే స్టెప్పులు
  • వెల్‌డన్ అల్లు అర్జున్ అంటూ వార్నర్ ప్రశంస 
  • డేవిడ్ వార్నర్ కూడా పలుసార్లు ‘బుట్టబొమ్మ’ డ్యాన్స్
త్రివిక్రమ్ దర్శకంతో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ పాటకు అల్లు అర్జున్, పూజా హెగ్డే స్టెప్పులు అదరగొట్టేసిన విషయం తెలిసిందే. యూట్యూబ్‌లో ఈ సాంగ్  మిలియన్ల కొద్దీ వ్యూస్‌ సాధిస్తూ దూసుకెళ్తోంది.  ఈ పాటకు ఆస్ట్రేలియా క్రికెటర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ పలు సార్లు డ్యాన్స్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. గతంలో తన భార్య క్యాండీస్ వార్నర్‌తో కలిసి డ్యాన్స్ చేసి అదరగొట్టాడు.

కరోనా వ్యాప్తి కారణంగా కొన్ని నెలల క్రితం ఇంట్లోనే ఉంటోన్న డేవిడ్ వార్నర్ ఇలా బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్ చేసి పోస్ట్ చేయడంతో అప్పట్లో అది తెగ వైరల్ అయింది. ఐపీఎల్‌లో ఓ మ్యాచ్ గెలిచిన సందర్భంలోనూ డేవిడ్ వార్నర్ బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్ చేసి అల్లు అర్జున్ అభిమానులను ఖుషీ చేశాడు.

అంతేగాక, మరోసారి కూడా బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్ చేస్తానని చెప్పాడు. తాజాగా, అల్లు అర్జున్ బుట్టబొమ్మ సాంగ్ యూట్యూబ్‌లో 450 మిలియన్ల వ్యూస్ దాటేసింది. దీంతో మరోసారి డేవిడ్ వార్నర్ దీనిపై స్పందించాడు. అల్లు అర్జున్ ను అభినందించాడు. 'వెల్‌డన్ అల్లు అర్జున్' అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో బుట్టబొమ్మ పోస్టర్‌ను పోస్ట్ చేశాడు.
Butta Bomma
Allu Arjun
David Warner
Instagram
Pooja Hegde
Tollywood

More Telugu News