Bharathi Singh: డ్రగ్స్ కేసులో నటి భారతీ సింగ్ కు బెయిల్!

Commedy Actress Bharathi Singh Gets Bail
  • సోదాల తరువాత భారతి ఇంట్లో గంజాయి స్వాధీనం
  • ఆదివారం అరెస్ట్ అయిన భారతీ సింగ్ దంపతులు
  • బెయిల్ మంజూరు చేసిన ముంబై కోర్టు
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హాస్య నటి భారతీ సింగ్, ఆమె భర్త హర్ష్ లింబాచియాలకు ముంబై కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. వీరిద్దరినీ ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శనివారం నాడు వీరి ఇంట్లో సోదాలు జరుపగా 86.5 గ్రాముల గంజాయి దొరకడంతో వారిని విచారణకు పిలిపించి, ప్రశ్నించిన తరువాత ఇద్దరినీ అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు.

నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య తరువాత బాలీవుడ్ లో డ్రగ్స్ వాడుతున్న వారిలో భయం మొదలైంది. ఇప్పటికే ఈ కేసులో భాగంగా పలువురు ప్రముఖులను ఎన్సీబీ విచారించింది. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన పలువురికి కోర్టులు ఇప్పటికే బెయిల్ ను మంజూరు చేశాయి. డ్రగ్స్ కేసులో సంబంధాలున్నాయన్న అనుమానం వచ్చిన ప్రతి సెలబ్రిటీపైనా నిఘా పెడుతున్న అధికారులు, వారి ఇళ్లలో ఆకస్మిక సోదాలు జరుపుతున్నారు.
Bharathi Singh
Bail
Bollywood
Drugs Case

More Telugu News