మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరిన హర్షకుమార్

23-11-2020 Mon 21:06
  • మళ్లీ కాంగ్రెస్ లో చేరడం సంతోషంగా ఉందన్న హర్షకుమార్
  • బీజేపీని నిలదీయడంలో వైసీపీ, టీడీపీ విఫలమయ్యాయని విమర్శ
  • రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని వ్యాఖ్య
Harsha Kumar joins Congress

మాజీ ఎంపీ హర్షకుమార్ మళ్లీ తన సొంత గూటికి చేరుకున్నారు. ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఊమన్ చాందీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మళ్లీ కాంగ్రెస్ లో చేరడం సంతోషంగా ఉందని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని... బీజేపీని నిలదీయడంలో వైసీపీ, టీడీపీలు విఫలమయ్యాయని విమర్శించారు. ఇప్పటికే రెండు సార్లు మోసపోయిన ఏపీ ప్రజలు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరని అన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు.