శ్రీకాళహస్తిలో దాడికి గురైన జనసేన నేత వినుత కుటుంబాన్ని పరామర్శించిన సోము వీర్రాజు

23-11-2020 Mon 18:57
  • జనసేన శ్రీకాళహస్తి ఇన్చార్జి నివాసంపై దాడి
  • దాడిని ఖండించిన సోము వీర్రాజు
  • వైసీపీ ప్రోద్బలంతో జరిగిన దాడి అంటూ వ్యాఖ్యలు
Somu Veerraju condemns attack on Srikalahasti Janasena leader house

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు శ్రీకాళహస్తి వచ్చారు. ఇటీవల దాడికి గురైన శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జి కోటా వినుత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. సోము వీర్రాజు రాకతో బీజేపీ, జనసేన శ్రేణులు భారీగా తరలివచ్చాయి. తన పర్యటన గురించి ఆయన ట్విట్టర్ లో వెల్లడించారు.

జనసేన పార్టీ నేత, గత ఎన్నికల్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన వినుత కుటుంబంపై వైసీపీ ప్రోద్బలంతో జరిగిన ఈ దాడిని ఖండిస్తున్నానని తెలిపారు. బాధితులకు నైతిక మద్దతు ఇవ్వడం కోసం బీజేపీ, జనసేన కార్యకర్తలతో కలిసి వారిని పరామర్శించానని వెల్లడించారు. కాగా, వినుత ఇంట్లో జరిగిన దాడి ఆనవాళ్లను, ధ్వంసమైన కారును ఆయన పరిశీలించారు.