కుర్చీలో కూర్చోబోతూ కింద పడిపోయిన సినీ నటుడు రవి కిషన్

23-11-2020 Mon 16:39
  • గోరఖ్ పూర్ లో ఛాప్ పూజ వేడుకలు
  • వేడుకల చివరి రోజున హాజరైన రవి కిషన్
  • వేదికపై రవి కిషన్ కి సన్మానం
Actor turned BJP MP Ravi Kishan FALLS OFF his chair on stage

కొన్ని సార్లు ఊహించని ఘటనలు జరిగిపోతూ ఉంటాయి. తాజాగా సినీ నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ కు కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే, ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో జరిగిన ఛాత్ పూజ చివరి రోజు వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వేదిక పైకి ఆయన వెళ్లారు. వేదిక పైన బీజేపీ నేతలు ఆయనకు కాషాయం రంగు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టారు. అనంతరం అందరికీ ధన్యవాదాలు తెలిపి, కూర్చీలో ఆయన కూర్చోబోయారు. అయితే, ఊహించని విధంగా ఆయన కింద పడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.