చంద్రబాబు కష్టాన్ని కొట్టేయాలని జగన్ రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు: నారా లోకేశ్

23-11-2020 Mon 16:30
  • రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందన్న లోకేశ్
  • కంపెనీలు పారిపోతున్నాయని వెల్లడి
  • ఈ 18 నెలల్లో జగన్ సాధించింది శూన్యమని వ్యాఖ్యలు
Lokesh alleges that CM Jagan tries to steal Chandrababu hard work

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తుగ్లక్ పరిపాలన చూసి కంపెనీలన్నీ పరార్ అంటూ వ్యాఖ్యానించారు. గత 18 నెలల కాలంలో కూల్చివేతలు, కక్ష సాధింపులు, జే ట్యాక్స్ తప్ప జగన్ సాధించింది శూన్యమని విమర్శించారు. రాష్ట్రానికి కంపెనీలు తీసుకురావడం చేతగాని జగన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు కష్టాన్ని కొట్టేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

"కంపెనీల పేర్ల పక్కన జగన్ రెడ్డి ఫొటోలు ఎంతపెద్దగా వేసినా, అందులో కనిపించేది రాష్ట్రానికి కంపెనీలు తెచ్చి యువతకు ఉపాధి కల్పించిన చంద్రబాబు కష్టమే. ఈ విషయం గన్నేరుపప్పుకు ఎప్పుడు అర్థమవుతుందో" అంటూ లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు.