pradeep: ఆ క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి!: యాంకర్ ప్రదీప్‌

pradeep about meeting with chiru
  • సెలబ్రిటీ టాక్‌షోలో పాల్గొన్న యాంకర్ ప్రదీప్
  • మెగాస్టార్‌ చిరంజీవిని కలవడానికి వెళ్లినప్పుడు మధురజ్ఞాపకం
  • దూరం నుంచే నన్ను చూసి, దగ్గరకు రమ్మన్నారు
  • పేరు పెట్టి పిలిచి మెచ్చుకున్నారు
యాంకర్ సుమ నిర్వహిస్తున్న సెలబ్రిటీ టాక్‌షోలో తాజాగా యాంకర్ ప్రదీప్ పాల్గొన్నాడు. తన వ్యక్తిగత జీవితం గురించి, తాను కలిసిన సినీ ప్రముఖుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. టీవీ యాంకరింగ్‌ ప్రారంభించిన సమయంలో తాను తొలిసారి మెగాస్టార్‌ చిరంజీవిని కలవడానికి వెళ్లినప్పుడు ఆయన దూరం నుంచే తనను చూసి, దగ్గరకు రమ్మని పేరు పెట్టి పిలిచారని చెప్పాడు.

తన వాయిస్‌ అంటే బాగా ఇష్టమని, తాను పలికే తెలుగు పదాల ఉచ్చారణ బాగుంటుందని చిరంజీవి మెచ్చుకున్నారని తెలిపాడు. దీంతో తాను చాలా సంబర పడ్డానని అన్నాడు. ఆ మధుర జ్ఞాపకం ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపాడు. యాంకర్ గానే కాకుండా సినీనటుడిగానూ ఇప్పుడు ప్రదీప్ రాణిస్తున్నాడు.
pradeep
Tollywood
Chiranjeevi

More Telugu News