sriti hassan: రెండేళ్లు గ్యాప్ తీసుకున్న విషయంపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ శ్రుతిహాసన్

sriti hassan
  • నా కెరీర్‌కు బ్రేక్ పడదు 
  • నేను కేవలం నటిని మాత్రమే కాదు
  • మోడలింగ్, రచన, పెయింటింగ్, సంగీతం రంగాల్లో బిజీ
  • అన్ని విభాగాల్లో ఒక్కోసారి బ్రేక్ తీసుకుంటా
సాధారణంగా హీరోయిన్లు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళతారు. అయితే, దక్షిణాదిన అగ్ర హీరోయిన్లలో ఒకరైన శ్రుతిహాసన్ రెండేళ్లపాటు కొత్త సినిమాల్లో కనపడలేదు. ఇంత కాలం ఆమె గ్యాప్ తీసుకోవడంతో ఆమె కెరీర్ కు బ్రేక్ పడిందని చాలా మంది భావించారు.

అయితే, నటనతో పాటు ఎన్నో విషయాల్లో టాలెంట్ ఉన్న శ్రుతిహాసన్ ఈ రెండేళ్ల సమయంలో వాటిపై దృష్టి పెట్టిందట. తాజాగా ఆమె పలు సినిమాల్లో నటించడానికి ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలు తెలిపింది. తన కెరీర్‌కు బ్రేక్ పడదని, తానే కావాలని బ్రేక్ తీసుకుంటూ ఉంటానని చెప్పింది.

తాను కేవలం నటిని మాత్రమే కాదని, మోడలింగ్, రచన, పెయింటింగ్, సంగీతం వంటి పలు రంగాలలో బిజీగా ఉంటానని చెప్పింది. అన్ని విభాగాల్లో ఒక్కోసారి బ్రేక్ తీసుకుంటానని చెప్పింది. తాను వరుసగా నాలుగు సినిమాలు చేసిన అనంతరం మ్యూజిక్ ప్రాజెక్టులు, ఇతర విషయాల కోసం సమయాన్ని వెచ్చిస్తానని తెలిపింది. కరోనా విజృంభణ సమయంలోనూ తాను పనిచేస్తూనే ఉన్నానని చెప్పింది.
sriti hassan
Tollywood
Tamilnadu

More Telugu News