Anushka Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Anushka not part of Sarkaru Vari Pata movie
  • మహేశ్ సినిమాలో అనుష్క లేదట!
  • మాల్దీవులలో చైతు, సామ్ జంట
  • విశాఖలో 'కోతికొమ్మచ్చి' షూటింగ్  
*  మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సర్కారు వారి పాట' చిత్రంలో అనుష్క కీలక పాత్ర పోషించనుందంటూ గత కొన్ని రోజులుగా ఓ వార్త ప్రచారంలో వుంది. అయితే, అందులో వాస్తవం లేదని, అది ఫేక్ న్యూస్ అనీ చిత్రం యూనిట్ పేర్కొంది.
*  ఇటీవల మన సినీ తారలంతా హాలిడే కోసం మాల్దీవులకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు తారలు అక్కడ సేదదీరుతున్నారు. ఈ క్రమంలో అక్కినేని నాగ చైతన్య, సమంత జంట కూడా తాజాగా మాల్దీవులకు హాలిడే ఎంజాయ్ చేయడం కోసం వెళ్లింది.
*  సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న 'కోతికొమ్మచ్చి' చిత్రం షూటింగ్ ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతోంది. దీనికి ముందు అమలాపురంలో కొంత షూటింగ్ జరిగింది. మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్న ఇందులో హీరోలుగా నటిస్తున్నారు.
Anushka Shetty
Mahesh Babu
Samantha
Naga Chaitanya

More Telugu News