రజనీ ఆరోగ్యంపై మళ్లీ పుకార్లు... వివరణ ఇచ్చిన పీఆర్ టీమ్

22-11-2020 Sun 21:16
  • రజనీకాంత్ జ్వరంతో బాధపడుతున్నాడని ప్రచారం
  • అంతా అవాస్తవం అని వెల్లడించిన పీఆర్ టీమ్
  • రజనీ పొయెస్ గార్డెన్ నివాసంలో ఉన్నారని స్పష్టీకరణ
PR Team clarifies on Rajinikanth health condition

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం దెబ్బతిన్నదంటూ మళ్లీ పుకార్లు మొదలయ్యాయి. ఆయన జ్వరంతో బాధపడుతున్నాడని, చికిత్స అందుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఈ తరహా రూమర్లు విజృంభిస్తుండడంతో రజనీకాంత్ పబ్లిక్ రిలేషన్స్ (పీఆర్) టీమ్ స్పందించక తప్పలేదు. రజనీకాంత్ కేమీ కాలేదని, ఆయన నిక్షేపంగా ఉన్నారని వెల్లడించింది. నిన్నటి నుంచి చెన్నై పోయెస్ గార్డెన్ లోని తన నివాసంలో ఉన్నారని వివరించింది.

కొన్నాళ్లుగా రజనీ అనారోగ్యం కారణంగా సొంత పార్టీ వ్యవహారం కూడా వెనక్కి వెళ్లింది. గత నెలలో తాను అనారోగ్యానికి గురయ్యానని ఆయనే స్వయంగా వెల్లడించారు. కొన్నిరోజుల కిందట దీపావళి సందర్భంగా రజనీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకుంటూ దర్శనమిచ్చారు. దాంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.