బీజేపీని గెలిపిస్తే హైదరాబాదును అంబానీకి అమ్మేస్తారు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

22-11-2020 Sun 16:46
  • ఊపందుకున్న 'గ్రేటర్' ప్రచారం
  • గతంలో ప్రధాని కూడా కేసీఆర్ ను ప్రశంసించారన్న గౌడ్
  • ఇప్పుడు ఎన్నికల కోసమే విమర్శలు చేస్తున్నారని వెల్లడి
TRS Minister Srinivas Goud fires on BJP and Union Ministers

బల్దియా ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీలన్నీ విమర్శనాస్త్రాలకు పదును పెడుతున్నాయి. తాజాగా టీఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపీపై ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రుల మాటలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందని అన్నారు. గతంలో ప్రధాని సైతం కేసీఆర్ ను ప్రశంసించారని, కానీ ఇప్పుడు ఎన్నికల కోసమే తమపై విమర్శలు చేస్తున్నారని వెల్లడించారు.

తాము మేయర్ పదవిని ఎంఐఎంకు ఇస్తామని ప్రచారం చేస్తున్నారని, ఇది హాస్యాస్పదమైన విషయం అని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్న కేంద్రంపై చార్జిషీట్ వేయాలని అన్నారు. కేంద్రమంత్రులు తెలంగాణకు క్షమాపణలు చెప్పి వెళ్లాలని డిమాండ్ చేశారు. బీజేపీని గెలిపిస్తే హైదరాబాదును అంబానీకి అమ్మేస్తారని మంత్రి వ్యాఖ్యానించారు.