చిన్నవయసులోనే ప్రాణాలు విడిచిన బాలీవుడ్ నటి

22-11-2020 Sun 13:17
  • కిడ్నీ వ్యాధితో మృతి చెందిన లీనా ఆచార్య
  • 'హిచ్కీ' సినిమాతో గుర్తింపు
  • టీవీ సీరియళ్ల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన లీనా
 Bollywood and tv actress Leena Acharya dies of kidney decease

హిందీ చిత్రసీమ బాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. సినిమాలు, టీవీ కార్యక్రమాలతో గుర్తింపు తెచ్చుకున్న లీనా ఆచార్య మృత్యువాతపడ్డారు. లీనా వయసు 30 సంవత్సరాలు. లీనా గత రెండేళ్లుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. లీనా ఆచార్య చిన్నవయసులోనే ప్రాణాలు కోల్పోవడం పట్ల సినీ, టీవీ సహనటులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

లీనా నటనపై మక్కువతో మోడలింగ్ నుంచి వినోదరంగంలో ప్రవేశించారు. 'హిచ్కీ' అనే చిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత అనేక సినిమాల్లోనూ మేరీ హానికారక్ బీవీ, సేట్ జీ, ఆప్ కే జానే సే వంటి బుల్లితెర సీరియళ్లతో ఉత్తరాది రాష్ట్రాల్లో అభిమానులకు దగ్గరయ్యారు.