Madhya Pradesh: రోడ్డుపై అమ్మాయిలను వేధించిన యువకులు.. బింగిళ్లు తీయించి, తీసుకెళ్లిన పోలీసులు.. వీడియో ఇదిగో

  • మధ్యప్రదేశ్‌లో ఘటన
  • రోడ్లపై తిరుగుతూ పిచ్చివేషాలు వేస్తోన్న పోకిరీలు
  • అక్కడే బుద్ధి చెప్పిన పోలీసులు
రోడ్లపై తిరుగుతూ అమ్మాయిలను వేధిస్తోన్న ఇద్దరు యువకులకు పోలీసులు రోడ్డుపైనే బుద్ధి చెప్పారు. వారితో బింగిళ్లు తీయిస్తూ కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బిజీ రోడ్డులో నిన్న ఇద్దరు పోకిరీలు మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తుండడంతో పోలీసులు వారి చెవులు పట్టుకుని దేవాస్ వీధిలో తిప్పుతూ తీసుకెళ్లారు.  

ఆ యువకులకు పోలీసులు రోడ్డుపై అందరిముందూ బుద్ధిచెప్పడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటువంటి వారిని అందరి ముందూ శిక్షిస్తేనే మరొకరు ఇలాంటి పనులు చేయడానికి భయపడతారని కామెంట్లు చేస్తున్నారు.
Madhya Pradesh
Police
Crime News
Viral Videos

More Telugu News