Viral Videos: పిల్లలు పుడతారని.... 200 మంది మహిళలను తొక్కుతూ వెళ్లిన పూజారులు.. వీడియో ఇదిగో

  • సంతానం కోసం మహిళల పూజలు
  • మూఢనమ్మకాలంటున్న మహిళా కమిషన్
  • ఛత్తీస్‌గఢ్‌లోని ధమ్‌తరీ జిల్లాలో ఘటన
Childless women let priests walk on them in hope of a baby

సంతానం లేని వందలాది మంది మహిళలు బోర్లా పడుకోగా, పూజారులు, మంత్రగాళ్లు వారిని తొక్కుకుంటూ వెళ్లిన వైనం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని ధమ్‌తరీ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మధాయి జాతరకు ప్రతి ఏడాది వేలాది మంది తరలివస్తారు. అంగామోతి మాత దేవాలయం వద్ద ఈ జాతర జరుగుతుంది.

కరోనా విజృంభిస్తోన్న సమయంలోనూ ఈ సారి కూడా పెద్ద మొత్తంలో జనాలు వచ్చారు. సామాజిక దూరం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలన్నింటినీ గాలికి వదిలేశారు. పూజారులు వీపుపై తొక్కితే పిల్లలు పుడతారని అక్కడ ప్రజల్లో ఉన్న మూఢనమ్మకంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ ప్రాంతానికి వెళ్లి తాను మహిళల్లో మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తానని ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ కిరణ్యయి నాయక్ తెలిపారు.

మహిళలపై కొందరు పురుషులు అలా నడుచుకుంటూ వెళ్లడం సరికాదని చెప్పారు. వారి మత విశ్వాసాలు దెబ్బతినకుండానే తాము త్వరలో అవగాహన కల్పిస్తామని అన్నారు. 52 గ్రామాల నుంచి తరలివచ్చిన  దాదాపు 200 మంది మహిళలు నేలపై బోర్లా పడుకుని ఉండగా పదుల సంఖ్యలో పూజారులు వారిని తొక్కుకుంటూ వెళ్లారు. అమ్మవారికి సమర్పించడానికి వారు నిమ్మకాయలు, కొబ్బరికాయలు, ఇతర పూజా సామగ్రి తీసుకొచ్చారు.

More Telugu News