కోహ్లీ కొడుకు ఆస్ట్రేలియన్ అవుతాడనుకున్నా:అలెన్ బోర్డర్

22-11-2020 Sun 07:45
  • ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కోహ్లీ
  • అనుష్క కూడా వస్తుందనుకున్నాం
  • బిడ్డ ఆసీస్ లో పుడతాడని భావించామన్న బోర్డర్
Alen Border Comments on Virushka

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులకు పుట్టబోయే తొలి బిడ్డ తమ దేశవాసి అవుతాడని భావించామని వెటర్నర్ క్రికెటర్, ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కోహ్లీతో పాటు అనుష్క కూడా తమ దేశానికి వస్తుందని భావించామని, ఇక్కడే ఆమె తొలి బిడ్డకు జన్మనిస్తుందని అనుకున్నామని బోర్డర్ వ్యాఖ్యానించారు.

కాగా, తొలి టెస్ట్ తరువాత విరాట్ కోహ్లీ ఇండియాకు తిరిగి వచ్చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గర్భిణిగా ఉన్న అనుష్క ప్రసవించే సమయానికి కోహ్లీ ఆమె దగ్గరే ఉండాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. అందుకు బీసీసీఐ కూడా అనుమతించడంతో, తొలి టెస్ట్ ముగియగానే కోహ్లీ తిరుగు ప్రయాణం కానున్నాడు.