పాక్ కు మరో హెచ్చరిక!

22-11-2020 Sun 07:04
  • రెండు రోజుల క్రితం నలుగురు ఉగ్రవాదుల హతం
  • వారి వద్ద భారీ ఎత్తున ఆయుధాలు
  • పాక్ రేంజర్ల సాయంతోనే కాశ్మీర్ లోకి ప్రవేశం
India Warns Pakistan

రెండు రోజుల క్రితం నగ్రోటా సమీపంలో జైషే మొహమ్మద్ కు చెందిన ఉగ్రవాదులు భారత్ లో చొరబడేందుకు ప్రయత్నించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న కేంద్రం, పాకిస్థాన్ ను మరోమారు తీవ్రంగా హెచ్చరించింది. న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్ అధికారిని పిలిపించిన విదేశాంగ శాఖ, తన వైఖరిని తెలిపింది. పాక్ రేంజర్ల సాయంతో కాశ్మీర్ లోకి వచ్చిన ఉగ్రవాదులు ఓ ట్రక్కులో వెళుతుండగా, గుర్తించిన సైన్యం, వారిని ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. వారి వద్ద అత్యాధునిక ఆయుధాలు, పేలుడు సామాగ్రి లభించడంతో, పెద్ద విధ్వంసానికే వారు వచ్చారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రధాని సైతం ఈ ఘటనపై ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు.