Puri Jagannadh: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ను ఎందుకు 'భూతాల కొంప'గా పిలుస్తారో చెప్పిన పూరీ జగన్నాథ్

  • మ్యూజింగ్స్ లో వైట్ హౌస్ గురించి వివరించిన పూరీ
  • వైట్ హౌస్ లో పది మంది చనిపోయారని వెల్లడి
  • లింకన్ ఆత్మ గురించి ప్రస్తావన
Director Puri Jagannath explained why does people call white house a ghost house

దర్శకుడు పూరీ జగన్నాథ్ గత కొంతకాలంగా మ్యూజింగ్స్ పేరిట పోడ్ కాస్ట్ ఎపిసోడ్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. వివిధ సామాజిక అంశాలపై తన మనోభావాలను ఆయన పోడ్ కాస్ట్ ద్వారా వినిపిస్తున్నారు. తాజాగా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ గురించి ఒళ్లు గగుర్పొడిచేలా చెప్పారు. వైట్ హౌస్ ను ఎందుకు 'భూతాల కొంప' అని పిలుస్తారో వివరించారు. ఇప్పటివరకు వైట్ హౌస్ లో అధ్యక్షులు, ప్రథమ మహిళలు కలిపి 10 మంది వరకు చనిపోయారని వెల్లడించారు.

ఓసారి ఓ అధ్యక్షుడు స్నానం చేసి వస్తుంటే "గుడ్ మార్నింగ్ ప్రెసిడెంట్" అని వినిపిస్తే ఆయన హడలిపోయారని, అది అబ్రహాం లింకన్ ఆత్మ అని అప్పట్లో ప్రచారం జరిగిందని పూరీ వివరించారు. లింకన్ 11 ఏళ్ల కొడుకు వైట్ హౌస్ లో చనిపోవడం వల్ల ఆ చిన్నారి ఆత్మను పలకరించేందుకే లింకన్ ఆత్మ వైట్ హౌస్ కు వస్తుంటుందని చెప్పుకుంటారని వివరించారు. "పైగా, రాత్రివేళల్లో అక్కడ ఏవో శబ్దాలు వినిపిస్తాయట. వయొలిన్ వాయించినట్టు, గట్టిగా అరుస్తున్నట్టు ధ్వనులు వస్తుంటాయట" అని వివరించారు.

More Telugu News