జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఆటలు సాగవు: కవిత

21-11-2020 Sat 20:23
  • హైదరాబాదులో శాంతిభద్రతలు కాపాడింది కేసీఆరేనని వెల్లడి
  • ప్రజలు అడగకముందే పనిచేశామన్న కవిత
  • గ్రేటర్ ఎన్నికల్లో సెంచరీ సాధిస్తామని ధీమా
Kalvakuntla Kavitha comments ahead of GHMC elections

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో శాంతిభద్రతలను కాపాడిన ఘనత సీఎం కేసీఆర్ దేనని ఉద్ఘాటించారు. ప్రజలు అడగకముందే పని చేసిన ఘనత తమ ప్రభుత్వానికే చెందుతుందని అన్నారు. నగరంలో వరదలు వస్తే కేంద్రం ఎలాంటి సాయం చేయలేదని, కిషన్ రెడ్డి కేంద్రం నుంచి ఒక్కరూపాయి కూడా తీసుకురాలేదని విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఆటలు సాగవని స్పష్టం చేశారు.

అభ్యర్థుల విజయం కోసం టీఆర్ఎస్ కార్యకర్తలు కృషి చేయాలని కవిత పిలుపునిచ్చారు. గ్రేటర్ ఎన్నికల్లో సెంచరీ సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలని భావిస్తున్న బీజేపీ అబద్ధాలను ప్రచారం చేస్తోందని, విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆరోపించారు.