Panneerselvam: అమిత్ షా పర్యటన సందర్భంగా కీలక ప్రకటన చేసిన పన్నీర్ సెల్వం

  • బీజేపీతో అన్నాడీఎంకే పొత్తు కొనసాగుతుందన్న పన్నీర్
  • అసెంబ్లీ ఎన్నికల్లో మా కూటమి ఘన విజయం సాధిస్తుందని వ్యాఖ్య
  • అన్నాడీఎంకే ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించిన అమిత్ షా
Our alliance with BJP will continue says AIADMK

బీజేపీతో తమ పొత్తు కొనసాగుతుందని తమిళనాడు డిప్యూటీ సీఎం, అన్నాడీఎంకే చీఫ్ కోఆర్డినేటర్ పన్నీర్ సెల్వం ప్రకటించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెన్నై పర్యటన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా పెట్టుకున్న పొత్తు వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగుతుందని ముఖ్యమంత్రి పళనిస్వామి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి తమిళనాడు మద్దతు ఎప్పుడూ ఉంటుందని అన్నారు.

మరోవైపు తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వంపై అమిత్ షా ప్రశంసలు కురిపించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో అన్నాడీఎంకే ప్రభుత్వ చర్యలు అద్భుతమని కితాబిచ్చారు. కేంద్ర ర్యాంకుల ప్రకారం తమిళనాడు ఉత్తమ రాష్ట్రంగా ఉందని చెప్పారు. కరోనా వల్ల ప్రపంచంలోని అనేక దేశాలు తల్లడిల్లాయని... కానీ మోదీ నాయకత్వంలో మహమ్మారిని మన దేశం బాగా కట్టడి చేసిందని అన్నారు. కరోనాను కట్టడి చేయడంలో సఫలీకృతమైన పళనిస్వామి, పన్నీర్ సెల్వంలను అభినందిస్తున్నానని చెప్పారు. తమిళనాడులో కరోనా రికవరీ రేటు ఎక్కువగా ఉందని తెలిపారు. గర్భిణుల విషయంలో తమిళనాడు ప్రభుత్వం తీసుకున్నన్ని జాగ్రత్తలు మరే రాష్ట్రం తీసుకోలేదని చెప్పారు.

గతంలో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న 10 ఏళ్లలో తమిళనాడుకు డీఎంకే ఏం చేసిందో చెప్పగలదా? అని అమిత్ షా ప్రశ్నించారు. కుటుంబ రాజకీయాలు చేసే వారికి ప్రజలు బుద్థి చెపుతున్నారని... తమిళనాడులో కూడా అదే జరుగుతుందని అన్నారు. 2జీ స్ప్రెక్టం కుంభకోణంలో ఉన్న వ్యక్తులకు రాజకీయాల గురించి మాట్లాడే అర్హత కూడా లేదని విమర్శించారు.

More Telugu News