తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ రాకపోవచ్చు: ఈటల

21-11-2020 Sat 16:27
  • ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉంది
  • రోజుకు 50 వేల కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నాం
  • బడులు తెరవడంపై కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు
There may be no Corona second wave says Etela Rajender

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్, పాఠశాలల ప్రారంభం వంటి అంశాలపై రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉండకపోవచ్చని చెప్పారు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ప్రతి రోజు 50 వేల మందికి కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నామని చెప్పారు. హైదరాబాదులో ప్రివెంటివ్ హెల్త్ కేర్ అండ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్-2020 పేరిట 'సేఫ్ రీఓపెనింగ్ ఆఫ్ స్కూల్స్' అంశంపై జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేరకు స్పందించారు.

పాఠశాలలను ప్రారంభించడానికి ప్రైవేట్ యాజమాన్యాలన్నీ సిద్ధంగా ఉన్నాయని... ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని మంత్రిని ట్రస్మా ప్రతినిధులు కోరారు. దీనికి సమాధానంగా అందరూ కలసికట్టుగా ఒక నిర్ణయం తీసుకోవాలని వారికి మంత్రి సూచించారు. పాఠశాలలను మళ్లీ ప్రారంభించే విషయంలో సీఎం కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అవసరమైన పక్షంలో స్కూళ్లలో కూడా కరోనా పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు.