మహిళను తుపాకీతో బెదిరించి బంగారు చైన్ లాక్కెళ్లిన దొంగలు.. వీడియో విడుదల చేసిన పోలీసులు
- పెళ్లికి వెళ్లి వస్తుండగా మహిళను బెదిరించిన దొంగలు
- క్రైమ్ లో ఇద్దరు పాల్గొన్నారన్న పోలీసులు
- సీసీటీవీలో విజువల్స్ లభ్యం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఈ క్రైమ్ లో ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నారు. విజువల్స్ లో ఉన్న వ్యక్తి ఇద్దరిలో ఒకడు. ఈ దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. తూర్పు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో సెక్యూరిటీ కెమెరాల ఫీడ్ ఆధారంగా వారిని పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. బాధితురాలు లక్ష్మి ఒక పెళ్లికి వెళ్లి ఒంటరిగా తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. దొంగలు ఆమె చైన్ ను లాక్కెళ్లారు. వెంటనే ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది.