హైదరాబాదులో పూజా కార్యక్రమాలు జరుపుకున్న మహేశ్ బాబు 'సర్కారు వారి పాట'

21-11-2020 Sat 14:23
  • పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా 'సర్కారు వారి పాట'
  • క్లాప్ కొట్టిన సితార
  • కెమెరా స్విచాన్ చేసిన నమ్రత
  • జనవరి నుంచి చిత్రీకరణ
Mahesh Babu Sarkaru vaari Paata starts

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు పరశురాం కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమాకు నేడు హైదరాబాదులో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహేశ్ బాబు ముద్దుల తనయ సితార క్లాప్ కొట్టగా, అర్ధాంగి నమ్రతా కెమెరా స్విచాన్ చేశారు. ఈ చిత్రంలో మహేశ్ సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. 'సర్కారు వారి పాట' చిత్రం రెగ్యులర్ షూటింగ్ 2021 జనవరి మొదటి వారం నుంచి జరగనుంది.

ఈ క్రేజీ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు 14 రీల్స్, మహేశ్ బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే ప్రీ రిలీజ్ బిజినెస్ పై జోరుగా ప్రచారం జరుగుతోంది.