మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం జగన్

21-11-2020 Sat 13:49
  • ఇటీవల పేర్ని నానికి మాతృవియోగం
  • అనారోగ్యంతో కన్నుమూసిన పేర్ని నాగేశ్వరమ్మ
  • పేర్ని నాని నివాసానికి వెళ్లిన సీఎం జగన్
CM Jagan visits Perni Nani and family members

ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తల్లి నాగేశ్వరమ్మ (82) ఇటీవల కన్నుమూశారు. ఈ నేపథ్యంలో, మాతృవియోగం పొందిన మంత్రి పేర్ని నానిని సీఎం జగన్ పరామర్శించారు. ఇవాళ సీఎం జగన్ మచిలీపట్నంలోని మంత్రి పేర్ని నాని నివాసానికి వెళ్లారు. విషాదంలో ఉన్న నాని కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు.

నాగేశ్వరమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మచిలీపట్నంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే నయం అయిందని భావించి ఆమెను వైద్యులు డిశ్చార్జి చేయగా, మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. కాగా, నాగేశ్వరమ్మ భర్త పేర్ని కృష్ణమూర్తి గతంలో మంత్రిగా పనిచేశారు. ఆయన సమాచార మంత్రిత్వ శాఖను నిర్వహించారు.