‘ఆచార్య’ సినిమా సెట్స్‌లో సోనూసూద్‌కి సత్కారం!

21-11-2020 Sat 11:17
  • ఎక్కడికి వెళ్లినా సోనూసూద్‌పై ప్రశంసల జల్లు
  • ఆయనను మెచ్చుకుంటూ సత్కారాలు
  • సోనుని సత్కరించిన దర్శకుడు శివ కొరటాల, నటుడు తనికెళ్ల భరణి  
Tanikella Bharani sivakoratala  felicitated  SonuSood  on the sets of Acharya

కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ స‌మ‌యంలో చాలా మంది పేదలకు సాయం చేసి సినీన‌టుడు సోనూసూద్ అంద‌రి నుంచి ప్రశంసలందుకున్న  విష‌యం తెలిసిందే. ఇప్పటికీ ఆయన  తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆయనను రియల్ హీరో అని ప్రశంసిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ఆయనను సత్కరిస్తున్నారు.

తాజాగా, సోనూసూద్‌ను ఆచార్య సినిమా షూటింగ్ సెట్స్‌లో దర్శకుడు శివ కొరటాల, నటుడు తనికెళ్ల భరణి సత్కరించారు. ఆయనకు శాలువా కప్పి, హనుమంతుడి ప్రతిమను అందించారు. కాగా, దేశంలోని పేదలకు, రైతులకు, విద్యార్థులకు సోనూసూద్ సాయం చేస్తున్నారు. తాను సాయం చేసిన వారి వివరాలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు.