సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

21-11-2020 Sat 07:23
  • చాలా రోజుల తర్వాత డ్యాన్స్ చేస్తోందట!
  • యాక్షన్ ఎపిసోడ్ చేస్తున్న వరుణ్ తేజ్
  • మళ్లీ కెమెరా ముందుకు 'సఖి' నాయిక  
Rashi khanna joins dance sequence for a Tamil movie

*  చాలా రోజుల తర్వాత డ్యాన్స్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉందంటోంది కథానాయిక రాశిఖన్నా. సుందర్ సి దర్శకత్వంలో రూపొందుతున్న 'అరణ్ మణై' తమిళ సినిమా సీక్వెల్ లో ప్రస్తుతం ఆమె నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను ప్రస్తుతం ఆర్య, రాశిఖన్నా జంటపై పొలాచ్చిలో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్బంగా ఈ ముద్దుగుమ్మ డ్యాన్స్ ను బాగా ఎంజాయ్ చేస్తోందట.
*  వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న 'బాక్సర్' చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా హైదరాబాదులో జరుగుతోంది. ప్రస్తుతం వరుణ్ పాల్గొంటున్న ఓ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు.    
*  'సఖి' సినిమా ద్వారా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్న నిన్నటితరం కథానాయిక షాలిని తదనంతర కాలంలో హీరో అజిత్ ని పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయింది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. షాలిని త్వరలో ఓ వెబ్ సీరీస్ లో నటించనుందని వార్తలొస్తున్నాయి.