మరో విమానాశ్రయం ఎందుకు కట్టాలనుకుంటున్నామో మీ పేపర్ లో వచ్చిన వార్తే చెబుతోంది కదా !: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు విజయసాయి చురక

20-11-2020 Fri 21:16
  • భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు
  • మరో విమానాశ్రయం ఎందుకంటూ విమర్శలు
  • ట్విట్టర్ లో స్పందించిన విజయసాయిరెడ్డి
Vijayasai Reddy tweets on Bhogapuram airport

విశాఖలో ఇప్పటికే విమానాశ్రయం ఉండగా భోగాపురంలో విమానాశ్రయం ఎందుకంటూ ఏపీ సర్కారుపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఓ కథనం తాలూకు క్లిప్పింగ్ ను ఆయన ట్విట్టర్ లో పంచుకున్నారు. తూర్పు తీర నౌకాదళం విశాఖ ఎయిర్ పోర్టులో పౌరవిమానాలపై ఆంక్షలు విధించిందని, ఆ విషయాన్ని మీ పేపర్ లోనే ప్రచురించారంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

"ఏబీఎన్ రాధాకృష్ణా... మీకో విషయం గుర్తుచేస్తున్నాను. 11/6/18న ఈ వార్త మీ అభిప్రాయ దినపత్రికలో వచ్చింది. విశాఖ ఎయిర్ పోర్టులో పౌర విమానాల ఫ్లయింగ్ అవర్స్ పై నేవీ ఆంక్షలు విధించిందని మీ పత్రికలో పేర్కొన్నారు. మరో విమానాశ్రయం ఎందుకు కట్టాలనుకుంటున్నామో మీ పేపర్ లో వచ్చిన వార్తే చెబుతోంది కదా" అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.