ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ సభ ఉంటుంది: కేటీఆర్

20-11-2020 Fri 19:40
  • బండి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మి గుడికే ఎందుకు వెళ్లారు?
  • సిటీలో వేరే దేవాలయాలు ఎన్నో ఉన్నాయి
  • పాతబస్తీలో గెలుక్కునేందుకే వెళ్లారు
KCR rally will be there on 28 says KTR

హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసిరిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ మధ్యాహ్నం చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద హల్ చల్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సంజయ్ పై మండిపడ్డారు.

చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికే సంజయ్ ఎందుకు వెళ్లారని ఆయన ప్రశ్నించారు. నగరంలో బిర్లా మందిర్, తాడ్ బండ్ ఆంజనేయస్వామి గుడి తదితర ఆలయాలు ఎన్నో ఉండగా... చార్మినార్ వద్దకే ఎందుకు వెళ్లారని చెప్పారు. పాతబస్తీలో గెలుక్కునేందుకే అక్కడకు వెళ్లారని విమర్శించారు. ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభ జరుగుతుందని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సారి సెంచరీ కొట్టబోతున్నామని చెప్పారు.