Sriramulu: ఎస్వీబీసీ చానల్ కు రూ.కోటి విలువైన వాహనాన్ని విరాళంగా ఇచ్చిన కర్ణాటక మంత్రి

Karnataka minister Sriramulu donates DSNG vehicle to SVBC
  • డీఎస్ఎన్ జీ వాహనాన్ని విరాళంగా ప్రకటించిన మంత్రి
  • వాహనం విలువ రూ.1.20 కోట్లు
  • వాహనం పత్రాలను టీటీడీకీ అందించిన మంత్రి ప్రతినిధి
తిరుమల శ్రీవారి విశేషాలను ప్రసారం చేసే ఆధ్యాత్మిక చానల్ ఎస్వీబీసీకి కర్ణాటక మంత్రి శ్రీరాములు విలువైన డీఎస్ఎన్ జీ వాహనాన్ని విరాళంగా ఇచ్చారు. తద్వారా తిరుమల వెంకన్నపై తన భక్తిప్రపత్తులు చాటుకున్నారు. ఈ డీఎస్ఎన్ జీ వాహనం విలువ రూ.1.20 కోట్లు. చానళ్లు లైవ్ టెలికాస్ట్ చేసే సమయంలో ఈ వాహనాలను వినియోగిస్తారు. లొకేషన్ నుంచే శాటిలైట్ తో లింక్ అవ్వడానికి ఈ డీఎస్ఎన్ జీ వాహనంలో ఎలక్ట్రానిక్ వ్యవస్థలు ఉంటాయి. కాగా, ఈ వాహనానికి చెందిన పత్రాలను మంత్రి ప్రతినిధి టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి అందించారు.

తెలుగువాడైన శ్రీరాములు కర్ణాటక రాజకీయాల్లో బలమైన నేతగా కొనసాగుతున్నారు. బీజేపీకి చెందిన ఆయన ప్రస్తుత ప్రభుత్వంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చిత్రదుర్గ జిల్లాలోని మొలకలమూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Sriramulu
DSNG Vehicle
SVBC
Channel
TTD
Donation

More Telugu News