తిరుపతి ఉపఎన్నిక అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ

20-11-2020 Fri 18:01
  • డాక్టర్ గురుమూర్తిని అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ
  • పనబాక లక్ష్మిని రంగంలోకి దించిన టీడీపీ
  • ఎన్నికల నేపథ్యంలో పెరిగిన పొలిటికల్ హీట్
YSRCP announces Gurumurthy as its candidate for Tirupati Bypolls

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి రాష్ట్రంలో ఎన్నికల వేడి నెలకొంది. తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణంతో ఉప ఎన్నిక జరుగనుంది.

ఈ నేపథ్యంలో తమ అభ్యర్థి విషయంలో కసరత్తు చేసిన వైసీపీ అగ్ర నాయకత్వం... చివరకు డాక్టర్ గురుమూర్తిని అభ్యర్థిగా ప్రకటించింది. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని ఎన్నికల బరిలోకి దింపింది. ఈ ఉపఎన్నికలను అధికార, ప్రతిపక్షాలు రెండూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో... ఏపీలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది.