Sensex: వారాంతాన్ని లాభాల్లో ముగించిన మార్కెట్లు

  • 282 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 87 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 9 శాతానికి పైగా పెరిగిన బజాజ్ ఫిన్ సర్వ్
Sensex ends 282 points high

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాల్లో ముగించాయి. మధ్యాహ్నం తర్వాత బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులకు కొనుగోలు మద్దతు లభించడంతో మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 282 పాయింట్లు లాభపడి 43,882కి పెరిగింది. నిఫ్టీ 87 పాయింట్లు పుంజుకుని 12,859కి చేరుకుంది. ఎనర్జీ సూచీ మినహా మిగిలిన అన్ని సూచీలు లాభాలను ఆర్జించాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (9.13%), టైటాన్ కంపెనీ (5.61%), బజాజ్ ఫైనాన్స్ (4.05%), భారతి ఎయిర్ టెల్ (3.18%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (3.13%).

టాప్ లూజర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (-3.72%), సన్ ఫార్మా (-1.03%), యాక్సిస్ బ్యాంక్ (-1.01%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.94%), ఓఎన్జీసీ (-0.69%).

More Telugu News