చిరంజీవి సినిమాలో విలన్ గా నిన్నటితరం హీరో!

20-11-2020 Fri 12:45
  • విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన అరవింద్ స్వామి 
  • చిరంజీవి 'ఆచార్య'లో ప్రధాన విలన్ పాత్రకు ఎంపిక
  • త్వరలో షూటింగులో జాయిన్ కానున్న చిరంజీవి
  • వచ్చే నెల మొదటి వారం నుంచి కాజల్ షూటింగు  
Aravind Swamy as main villain in Chiranjeevis film

గతంలో 'రోజా' సినిమాతో హీరోగా ఒక్కసారిగా దూసుకొచ్చిన నటుడు అరవింద్ స్వామి. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి, వెండితెర అందగాడిగా అమ్మాయిల మనసులు దోచుకున్నాడు. తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్నాడు.

తిరిగి ఆమధ్య తన సెకండ్ ఇన్నింగ్స్ ను విలన్ గా ప్రారంభించాడు. సినిమాలో కీలకమైన విలన్ పాత్రలను, అందులోనూ తనకు నచ్చిన వాటిని మాత్రమే ఎంచుకుని చేసుకుంటూ వస్తున్నాడు. అలాగే ఆమధ్య రామ్ చరణ్ నటించిన 'ధృవ' సినిమాలో కూడ విలన్ గా తనదైన ముద్ర వేశాడు.

ఈ క్రమంలో ఇప్పుడు ఆయన చిరంజీవికి విలన్ గా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందుతున్న 'ఆచార్య' చిత్రంలో ప్రధాన విలన్ పాత్రకి కొంతమందిని పరిశీలించిన పిమ్మట, తాజాగా అరవింద్ స్వామిని తీసుకుంటున్నట్టు సమాచారం. వెండితెరపై చిరు, అరవింద్ ల కలయికలో వచ్చే సన్నివేశాలు పవర్ ఫుల్ గా వుంటాయని అంటున్నారు.

ఇక, ఈ చిత్రం ప్రోగ్రెస్ విషయానికి వస్తే, ఇటీవలే ఈ చిత్రం షూటింగును హైదరాబాదు రామోజీ ఫిలిం సిటీలో తిరిగి ప్రారంభించారు. ఒకటి రెండు రోజుల్లో చిరంజీవి కూడా షూటింగులో జాయిన్ కానున్నారు. ఇందులో కాజల్ కథానాయికగా నటిస్తోంది. ఆమె వచ్చే నెల మొదటి వారంలో ఈ చిత్రం షూటింగులో చేరుతుంది.