గోవా బీచ్ లో పర్యాటకులపై జెల్లీ ఫిష్ ల దాడి... 90 మందికి గాయాలు!

20-11-2020 Fri 12:15
  • గుంపులుగా వస్తున్న జెల్లీ ఫిష్ లు
  • నీటిలో దిగిన వారిపై దాడి
  • ఫస్ట్ ఎయిడ్ అందిస్తున్న వైద్య సిబ్బంది

గడచిన రెండు రోజులుగా గోవా బీచ్ లలో పర్యాటకులపై జెల్లీ ఫిష్ ల గుంపులు దాడులకు దిగుతూ బెంబేలెత్తిస్తున్నాయి. జెల్లీ ఫిష్ ల దాడుల్లో ఇప్పటివరకూ 90 మందికి పైగా గాయపడ్డారని గోవా బీచ్ లైఫ్ గార్డ్ ఏజన్సీ వెల్లడించింది.

 బగా- కలంగూటే బీచ్ లో దాదాపు 55 మంది, కండోలిమ్ - సింకెరిమ్ బీచ్ లో 10 మంది, దక్షిణ గోవా బీచ్ లో 25 మంది జెల్లీ చేపల బారిన పడ్డారని పేర్కొంది. గుంపులుగా వస్తున్న ఇవి, సముద్రంలోకి వెళ్లే పర్యాటకులపై దాడులు చేస్తున్నాయని వెల్లడించింది. గాయపడిన పర్యాటకులకు ఎప్పటికప్పుడు ప్రాధమిక చికిత్స అందించామని, బీచ్ ల వద్ద హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.