‘గ్రేటర్’ వార్.. జనసేన సహా ఐదు పార్టీలకు గుర్తులు కేటాయించిన ఈసీ

20-11-2020 Fri 10:34
  • తమకు గుర్తులు కేటాయించాల్సిందిగా ఈసీకి ధరఖాస్తు
  • ఐదేళ్ల కాలానికి గుర్తుల కేటాయింపు
  • జనసేనకు దక్కిన గాజుగ్లాసు
EC Allotted symbols to political parties for ghmc elections

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరిలో నిలిచిన పార్టీలకు ఎన్నికల కమిషన్ గుర్తులు కేటాయించింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమకు గుర్తులు కేటాయించాల్సిందిగా కోరుతూ బరిలోకి దిగిన పలు పార్టీలు కోరాయి. పరిశీలించిన ఈసీ జనసేన సహా ఐదు పార్టీలకు ఐదేళ్ల కాలానికి గుర్తులు కేటాయించింది. జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించగా, హిందూస్తాన్ జనతా పార్టీకి కొబ్బరితోట, ఇండియా ప్రజాబంధు పార్టీకి ట్రంపెట్, మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యునైటెడ్ పార్టీకి గ్యాస్ సిలిండర్, ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఈల గుర్తులను ఈసీ కేటాయించింది.