పెంపుడు శునకం మరణాన్ని జీర్ణించుకోలేక.. యువతి ఆత్మహత్య

20-11-2020 Fri 09:59
  • చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో ఘటన
  • శునకాన్ని ఖననం చేసిన అనంతరం ఇంటికొచ్చి ఉరి
  • శునకం పక్కనే తననూ ఖననం చేయాలని లేఖ
woman suicide after pet dog dead

ప్రాణప్రదంగా పెంచుకుంటున్న శునకం మరణించడాన్ని తట్టుకోలేకపోయిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌ జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. పీజీ చదువుతున్న ప్రియాంశు సింగ్ (21)  ఓ శునకాన్ని పెంచుకుంటోంది. మంగళవారం రాత్రి అది మరణించడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది.

శునకాన్ని ఖననం చేసిన అనంతరం ఇంటికొచ్చిన ప్రియాంశు గదిలోకి వెళ్లి ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు విస్తుపోయారు. ఆమె గదిని పరిశీలించగా, ఓ లేఖ దొరికిందని, శునకం పక్కనే తనను కూడా ఖననం చేయాలని అందులో రాసిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.