ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృత్యువాత
- ప్రయాగ్‌రాజ్-లక్నో జాతీయ రహదారిపై ఘటన
- మృతుల్లో ఆరుగురు చిన్నారులు
- వాహనాన్ని కట్ చేసి మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. నుజ్జుగా మారిన బొలెరో వాహనంలో మృతదేహాలు చిక్కుకుపోవడంతో దానిని ఎక్కడికక్కడ కట్‌చేసి వాటిని వెలికి తీశారు. బాధితులు నబాబ్ గంజ్ ప్రాంతంలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘోర దుర్ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.