Mahatma Gandhi: మహాత్ముడికి నోబెల్ ఎందుకు ఇవ్వలేదో చెప్పిన నోబెల్ ఫౌండేషన్

Nobel Foundation clarifies why Mahatma Gandhi was not given Nobel  Prize
  • గాంధీకి దక్కని నోబెల్ పురస్కారం
  • ఓ వ్యాసంలో జవాబు చెప్పిన నోబెల్ ఫౌండేషన్
  • పలు పర్యాయాలు నామినేట్ అయిన జాతిపిత
  • కమిటీ మెంబర్లలో మెజారిటీ దక్కని వైనం
భారత జాతిపిత మహాత్మా గాంధీ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ప్రజలకు ఆదర్శప్రాయుడు. అందులో ఎలాంటి సందేహంలేదు. తన అహింసా మార్గంతో నమ్మశక్యం కాని రీతిలో బ్రిటీష్ పాలకులను ఎదుర్కొన్నారు. అయితే అంతటి మహనీయుడికి ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతి రాకపోవడం ఆశ్చర్యకరమే. దీనిపై ఎప్పటినుంచో ప్రశ్నలు వినవస్తున్నాయి. నోబెల్ ఫౌండేషన్ ఓ వ్యాసంలో ఈ ప్రశ్నలకు జవాబిచ్చే ప్రయత్నం చేసింది.

గాంధీకి నోబెల్ పురస్కారం దక్కకపోవడానికి పలు కారణాలు ఉన్నా, ముఖ్యమైనది మాత్రం ఆయనలోని మితిమీరిన 'జాతీయవాదం' లేక మోతాదు మించిన 'దేశభక్తి' అని నోబెల్ ఫౌండేషన్ పేర్కొంది. గాంధీ 1937, 1938, 1939, 1947, 1948లో నోబెల్ అవార్డుకు నామినేట్ అయినా కమిటీ మెంబర్లలో మెజారిటీ రాకపోవడంతో ఆయనకు ప్రతిష్ఠాత్మక పురస్కారం ముఖం చాటేసింది.

అయితే, 1989లో దలైలామా వంటి వ్యక్తికి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చాక, గాంధీకి ఇవ్వలేకపోయామన్న పశ్చాత్తాపం నోబెల్ కమిటీ మెంబర్లలో కలిగిందని నోబెల్ ఫౌండేషన్ తన వ్యాసంలో వెల్లడించింది.
Mahatma Gandhi
Noble Prize
Nobel Foundation
India

More Telugu News