జీహెచ్ఎంసీ ఎన్నికలపై వైసీపీ కీలక ప్రకటన

19-11-2020 Thu 18:36
  • గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు
  • పార్టీ బలోపేతం కోసం కార్యాచరణ రూపొందిస్తున్నాం
  • ఈ విషయాన్ని నేతలు, కార్యకర్తలు గమనించాలి
YSRCP is not contesting in GHMC elections

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను వివిధ పార్టీలు ప్రకటిస్తున్నాయి. పలువురు అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు కూడా దాఖలు చేశారు. గ్రేటర్ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు జనసేన, టీడీపీ కూడా ప్రకటించాయి. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేయడంపై వైసీపీ కీలక ప్రకటన చేసింది. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వైసీపీ ప్రకటించింది.

ఈ మేరకు వైసీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి పేరిట ప్రకటన వెలువడింది. తెలంగాణలో వైసీపీని బలోపేతం చేయడానికి ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నామని ప్రకటనలో శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని పార్టీ నేతలు, కార్యకర్తలు, వైయస్సార్ అభిమానులు గమనించాలని కోరారు.