Gorantla Butchaiah Chowdary: భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపన కూడా జరగకముందే లేఖలు రాయడం విడ్డూరంగా ఉంది: గోరంట్ల

TDP leader Gorantla condemns Vijayasay Reddy letter to Union aviation ministry over Bhogapuram
  • భోగాపురం ఎయిర్ పోర్టు అంశంలో గోరంట్ల స్పందన
  • కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రికి విజయసాయి లేఖ
  • ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ఉందని గోరంట్ల విమర్శలు
టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి భోగాపురం ఎయిర్ పోర్టు అంశంపై స్పందించారు. భోగాపురంలో ఇంకా విమానాశ్రయ శంకుస్థాపన కూడా జరగలేదని, దానికోసం విశాఖ ఎయిర్ పోర్టులో 30 ఏళ్ల పాటు పౌర విమానయాన కార్యకలాపాలు నిలిపివేయాలని కోరుతూ విజయసాయిరెడ్డి కేంద్రానికి లేఖలు రాయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.

బహుశా భోగాపురంలో రియల్ ఎస్టేట్ పెరగాలన్న ఆశతోనే లేఖ రాసి ఉండొచ్చని గోరంట్ల పేర్కొన్నారు. అంతేకాదు, "మీ తీరు ఆదిలోనే హంసపాదు" అన్నట్టుగా ఉందని విమర్శించారు. ఈ మేరకు తన ట్వీట్ తో పాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి రాసిన లేఖ ప్రతిని కూడా పంచుకున్నారు.
Gorantla Butchaiah Chowdary
Vijay Sai Reddy
Bhogapuram
Airport
Vizag

More Telugu News