మంత్రి పేర్ని నానికి మాతృవియోగం

19-11-2020 Thu 15:36
  • పేర్ని నాని తల్లి నాగేశ్వరమ్మ కన్నుమూత
  • సంతాపం తెలిపిన సీఎం జగన్
  • కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాగేశ్వరమ్మ
AP Minister Perni Nani loses his mother

ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఇంట విషాదం నెలకొంది. పేర్ని నాని తల్లి నాగేశ్వరమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె వయసు 82 సంవత్సరాలు. మచిలీపట్నంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. తల్లిని కోల్పోయిన పేర్ని నానికి  సీఎం జగన్ తన సంతాపం తెలియజేశారు. తీవ్ర విచారంలో ఉన్న నానికి ఆయన ధైర్యం చెప్పారు.

కాగా, నాగేశ్వరమ్మ చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెకు ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే ఆమె కోలుకున్నట్టు భావించిన ఆసుపత్రి వర్గాలు రెండ్రోజుల కిందట డిశ్చార్జి చేశాయి. ఈ తెల్లవారుజామున నాగేశ్వరమ్మ తీవ్ర అస్వస్థత పాలవడంతో మళ్లీ అదే ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమించడంతో డాక్టర్ల ప్రయత్నాలు ఫలించలేదు.