ఎంఐఎంకు మేయర్ పదవి ఇచ్చేందుకు మాకేమైనా పిచ్చా?: కేటీఆర్

19-11-2020 Thu 13:27
  • ఎంఐఎంతో పొత్తు ఉండదు
  • ఒంటరిగానే పోటీ చేస్తాం
  • పాతబస్తీలో 10 సీట్లు గెలుస్తాం
There will be no alliance with MIM says KTR

గత జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఎంఐఎంతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా ఎంఐఎంతో టీఆర్ఎస్ కు పొత్తు ఉంటుందని, మేయర్ పదవిని ఆ పార్టీకే ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ కథనాలపై కేటీఆర్ స్పందించారు. ఎంఐఎంతో పొత్తు పెట్టుకోబోమని అన్నారు. టీఆర్ఎస్ సింగిల్ గానే పోటీ చేస్తుందని చెప్పారు. గత ఎన్నికలలో పాతబస్తీలో ఐదు స్థానాలను కైవసం చేసుకున్నామని... ఈ సారి 10 స్థానాలను కచ్చితంగా గెలుస్తామని చెప్పారు.

తమ పార్టీ విధానాలు నచ్చే... తమకు ఎంఐఎం మద్దతిచ్చిందని కేటీఆర్ అన్నారు. ఎంఐఎంకు మేయర్ పదవిని అప్పగించేందుకు మాకేమైనా పిచ్చా? అని ప్రశ్నించారు. 100 స్థానాల్లో గెలిచి తామే మేయర్ అవుతామని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు మేయర్ ఛైర్ లో కూర్చుంటారని అన్నారు. పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన కూడా తమకు లేదని స్పష్టం చేశారు.